కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..
ABN , Publish Date - Jan 29 , 2026 | 08:24 PM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులకు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వధువు మంటపంలోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఫొటోగ్రాఫర్ ఆమెను వీడియో తీస్తున్నాడు. వీడియో తీసే క్రమంలో వెనక్కు నడవాల్సి వచ్చింది. అయితే..
ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు.. సినిమాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. కొన్ని పెళ్లిళ్లలో అయితే సినిమా సీన్లకు మించిన క్రియేటివిటీని చూపిస్తున్నారు. ఇక ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వధూవరులను హీరో, హీరోయిన్ల తరహాలో చూపిస్తూ పాటలకు స్టెప్పులు కూడా వేయిస్తున్నారు. కొందరు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అయితే మరింత వినూత్నంగా ఆలోచిస్తూ వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్, మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఫొటోగ్రాఫర్.. వధూవరులకు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ ఫొటోగ్రాఫర్ నిబద్ధత మామూలుగా లేదుగా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులకు (Bride and groom) ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. వధువు మంటపంలోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఫొటోగ్రాఫర్ ఆమెను వీడియో తీస్తున్నాడు. వీడియో తీసే క్రమంలో వెనక్కు నడవాల్సి వచ్చింది. అయితే అక్కడే ఉన్న వాటర్ ఫౌంటెన్‌ను అతను గమనించలేదు. వీడియో తీస్తూ, ఒక్కో అడుగు వెనక్కు వేసుకుంటూ వచ్చాడు.
ఈ క్రమంలో వెనక చూసుకోకుండా పౌంటెన్ నీటిలో అడుగేశాడు. దీంతో కాలు జారి కెమెరా కొంచెం షేక్ అయింది. ఆ వెంటనే కిందపడకుండా నిలదొక్కుకుని, మళ్లీ యథాతథంగా వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. వీడియోగ్రాఫర్ (Videographer) నీళ్లలో కాలు జారడం చూసి అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ వెంటనే మళ్లీ నిలదొక్కుకుని వీడియో తీయడంతో హమ్మయ్య అని అనుకున్నారు. ఇలా ఆ వీడియోగ్రాఫర్ ఈ పెళ్లి వీడియోలను ఎంతో శ్రద్ధగా, అంకితభావంతో తీయడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ కెమెరామెన్ టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇతడికి పనిపై ఉన్న శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తోంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7.31 లక్షలకు పైగా లైక్‌లు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..