ఇదెక్కడి బెదిరింపురా నాయనా.. ఫైన్ వేసిన టీటీఈతో ఏమన్నాడో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:30 PM
ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోకల్ రైలు ఎక్కేశాడు. మధ్యలో టీటీఈ తనిఖీకి రావడంతో అనూహ్యంగా పట్టుబడ్డాడు. దీంతో అతడికి టీటీఈ ఫైన్ వేసింది. ఆమె ఫైన్ రాయడంతో సదరు ప్రయాణికుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ ఏమన్నాడంటే..
రైల్లో అప్పుడప్పుడూ సినిమా తరహా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తే.. మరికొన్నిసార్లు కొందరు టికెట్ తీసుకోకుండా టీటీఈలకు దొరికిపోతుంటారు. ఈ క్రమంలో టీటీఈలు, ప్రయాణికులకు మధ్య తమాషా సంఘటనలకు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తూ టీటీఈకి దొరికిపోయాడు. ఆమె ఫైన్ వేయడంతో సదరు ప్రయాణికుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి మాటలు విని అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబై లోకల్ రైలు అనగానే ప్రయాణికుల రద్దీ, తోపులాటలు, ప్రమాదకర ప్రయాణాలు, గొడవలే గుర్తుకొస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ లోకల్ రైళ్లలో తమాషా సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు టీటీఈలు, ప్రయాణికుల మధ్య తమాషా సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా, ఈ తరహా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోకల్ రైలు ఎక్కేశాడు. మధ్యలో టీటీఈ తనిఖీకి రావడంతో అనూహ్యంగా పట్టుబడ్డాడు. దీంతో అతడికి (TTE fines passenger) టీటీఈ ఫైన్ వేసింది. ఆమె ఫైన్ రాయడంతో సదరు ప్రయాణికుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ ‘మేడం మీరు నాకు ఫైన్ వేశారంటే.. వచ్చే నెల మొత్తం రైల్లో టికెట్ లేకుండానే ప్రయాణిస్తా’.. అంటూ హెచ్చరించాడు. అతడి మాటలకు టీటీఈతో పాటూ అక్కడున్న మిగతా ప్రయాణికులంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇతడి బెదిరింపులు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఇది పైసా వసూల్ ఆఫర్‌లా ఉందే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32 వేలకు పైగా లైక్‌లు, 2.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..