మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Jan 24 , 2026 | 09:59 PM
ఓ పిల్లి ఆహారం కోసం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. అయితే ఆహారం ఎక్కడా కనిపించకపోవడంతో దిగాలుగా కూర్చుని ఆలోచిస్తోంది. దాని పక్కనే అనేక వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే..
మీ కళ్లకు పరీక్ష పెట్టే అనేక సాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో పజిల్‌కు సంబంధించిన చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. మీ కోసం గతంలో చాలా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను తీసుకొచ్చాం. తాజాగా మరో ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తెచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లి కనిపిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ చేప దాక్కుని ఉంది. అదెక్కడుందో 20 సెకన్లలో కనుక్కుంటే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (optical illusion ) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి ఆహారం కోసం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. అయితే ఆహారం ఎక్కడా కనిపించకపోవడంతో దిగాలుగా కూర్చుని ఆలోచిస్తోంది. దాని పక్కనే అనేక వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే ఆ పిల్లికి సమీపంలోనే (hidden fish) ఓ చేప కూడా దాగి ఉంది. అయినా ఆ పిల్లి దాన్ని గుర్తించలేకపోతోంది.
చేపను గుర్తించి పిల్లికి సాయం చేసేందుకు మీరూ సాయం చేయండి. చాలా మంది ఆ చేపను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ చేప ఎక్కడుందో మీరూ కనిపెట్టండి మరి. ఒక వేళ ఇప్పటికీ ఆ చేపను గుర్తించలేకుంటే మాత్రం ఈ కింది చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మీలోని పరిశీలనా శక్తిని మరింత పెంచడంలో సాయం చేస్తాయి.
ఈ చిత్రంలో దాక్కున్న చేపను 20 సెకన్ల లోపు కనుక్కుంటే మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.
ఒక వేళ ఇప్పటికీ గుర్తించలేకున్నా నో టెన్షన్. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి..
ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..
మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..