Share News

ఈ భర్త తెలివి మామూలుగా లేదుగా.. భార్యపై ప్రేమ చూపిస్తూనే.. మరో వైపు..

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:15 PM

భార్యాభర్తలు రైల్లో ప్రయాణిస్తున్నారు. భార్య ఫోన్ చూస్తుండగా.. ఆమె పక్కనే భర్త కూర్చున్నాడు. భార్య భుజంపై చేయి వేసి తన ప్రేమను చూపించాడు. ఇందులో అవాక్కడానికి, నవ్వుకోవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. ఇంతకీ ఇతను ఏం చేశాడో మీరే చూడండి..

ఈ భర్త తెలివి మామూలుగా లేదుగా.. భార్యపై ప్రేమ చూపిస్తూనే.. మరో వైపు..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. వినూత్నంగా ఉన్న ఏ సంఘటన అయినా క్షణాల్లో.. వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోతుంటాయి. విన్యాసాలు, వింతలు, ప్రాంక్‌లు తదితర వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైల్లో ఓ భర్త.. తన భార్య భుజంపై చేయి వేసి మరీ ప్రేమ చూపించాడు. అయితే మరోవైపు అతను చేస్తున్న పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ఇతను మామూలోడు కాదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు రైల్లో ప్రయాణిస్తున్నారు. భార్య ఫోన్ చూస్తుండగా.. ఆమె పక్కనే భర్త కూర్చున్నాడు. భార్య భుజంపై చేయి వేసి తన ప్రేమను చూపించాడు. ఇందులో అవాక్కడానికి, నవ్వుకోవడానికి ఏముందీ అనేగా మీ సందేహం. భార్య భుజంపై చేయి వేసిన అతను.. ఆమెకు తెలీకుండా ఓ పని చేశాడు.


భార్యకు తెలీకుండా ఎంతో తెలివిగా ఖైనీ వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక చేతిలో (Husband Chewing tobacco without her wife knowledge) నుంచి మరో చేతిలోకి ఖైనీ వేసి, దాన్ని అంతే చాకచక్యంగా చేత్తో చాలా సేపు నలిపేశాడు. ఆ తర్వాత ఎంతో తెలివిగా ఆ ఖైనీని నోట్లో పెట్టుకున్నాడు. అతడి భార్య ఫోన్ మాయలో ఉండగా.. భర్త ఇలా ఆమె కళ్లుగప్పి ఖైనీ వేసుకున్నాడన్నమాట. వారికి పై బెర్త్‌లో పడుకున్న వ్యక్తి.. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ భర్త తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఖైనీ ఆరోగ్యానికి హానికరం.. ఇప్పటికైనా తెలుసుకుని మానేయ్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3,500కి పైగా లైక్‌లు, 1.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2026 | 06:16 PM