Car Acciddent Viral Video: బైకును ఢీకొన్న కారు.. మరుక్షణమే బైకర్ చేసిన పని చూస్తే..
ABN , Publish Date - Jan 10 , 2026 | 08:55 AM
ఓ కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు తన దారిలో సక్రమంగా వెళ్తున్న సమయంలో ఓ బైకర్.. ఊహించని విధంగా వాహనానికి ఎదురుగా వచ్చాడు. కారు ఢీకొట్టగానే ఆ వ్యక్తి ఎగిరి బానైట్‌పై పడిపోయాడు. అయితే..
రోడ్డు ప్రమాదాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు అంతా విస్తుపోయే దృశ్యాలు కూడా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అయితే కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ అంతా అవాక్కయ్యే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎదురుగా వచ్చిన ఓ బైకర్‌ను కారు ఢీకొంది. ఆ మరుక్షణమే బైకర్ చేసిన పని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు తన దారిలో సక్రమంగా వెళ్తున్న సమయంలో ఓ బైకర్.. ఊహించని విధంగా వాహనానికి ఎదురుగా వచ్చాడు. కారు ఢీకొట్టగానే (Car hits bike) ఆ వ్యక్తి ఎగిరి బానైట్‌పై పడిపోయాడు. అయితే పడిపోగానే ఆ వ్యక్తి సడన్‌గా నిద్ర వస్తున్నట్లు ప్రవర్తించాడు.
ఏమాత్రం భయం, ఆందోళన పడకుండా కారు బానైట్‌పై కామ్‌గా పడుకున్నాడు. ఎలాగైతే మంచంపై హాయిగా నిద్రపోతామో.. ఈ వ్యక్తి అచ్చం అలాగే పడుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇలా చాలా సేపు అతను (Biker falls asleep on car bonnet) నిద్రపోతున్నట్లు ప్రవర్తించాడు. అతడి వింత నిర్వాకం చూసి కారులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం కారులో అమర్చిన డ్యాష్ క్యామ్‌లో రికార్డ్ అయింది. ఈ ఘటన మలేషియాలో జరిగినట్లు కొందరు చెబుతున్నా కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ బైకర్ చివరకు హాయిగా నిద్రపోయాడు’.. అంటూ కొందరు, ‘ఇతను బాగా తాగినట్లు ఉన్నాడు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 1.60 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..
పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..