Share News

Jugaad Viral Video: ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:15 PM

ఓ మహిళ ఖాళీ పేస్ట్ ట్యూబ్‌తో వింత ప్రయోగం చేసింది. సాధారణంగా ఎవరైనా పేస్ట్ అయిపోగానే ట్యూబ్‌ను చెత్త బుట్టలో పడేస్తుంటారు. కానీ ఈమె మాత్రం దాన్ని కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈమె ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Jugaad Viral Video: ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..

ఎందుకూ పనికిరావు అనుకున్నవి కాస్తా.. కొందరి చేతుల్లోకి వెళ్తే అద్భుతంగా మారిపోతుంటాయి. ఇంకొందరు వాటిని తిరిగి వినియోగించే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు చేసే ప్రయోగాలు చూస్తే, ఇలాక్కూడా చేయొచ్చా.. అని అనిపిస్తుంటుంది. వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ చూస్తుంటాం. ఈ తరహా వీడియోలు నెటిజన్లను కూడా తెగ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఖాళీ పేస్ట్ ట్యూబ్‌తో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఆమెను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఖాళీ పేస్ట్ ట్యూబ్‌తో (Empty paste tube) వింత ప్రయోగం చేసింది. సాధారణంగా ఎవరైనా పేస్ట్ అయిపోగానే ట్యూబ్‌ను చెత్త బుట్టలో పడేస్తుంటారు. కానీ ఈమె మాత్రం దాన్ని కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. అది కూడా అంతా ఆశ్చర్యపోయేలా దాన్ని మార్చేసింది. దుస్తులు ఇస్త్రీ చేసిన తర్వాత ఐరన్ బాక్స్ వైరును ఎలా పడితే అలా పడేస్తుంటారు. లేదా ఆ వైరును ఐరన్ బాక్స్‌కు చుట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు వైరు కాలిపోయే ప్రమాదం ఉంటుంది.


ఈమె మాత్రం అందరిలా చేయకుండా వైరును భద్రంగా చుట్ట చుట్టి పెట్టేందుకు ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను వాడింది. ఇందుకోసం ట్యూబ్ చివర భాగంలో ఒక రంధ్రం చేసింది. ఆ తర్వాత దాన్ని వైరుకు ప్లాస్టర్‌ తరహాలో చుట్టి, ఆ రంధ్రంలో ట్యూబ్ ముందు భాగాన్ని ఉంచి మూత పెట్టేసింది. దీంతో ఆ వైరు (Iron box wire) కాలిపోయే ప్రమాదం లేకుండా చేసిందన్నమాట. ఇలా పక్కన పడేయాల్సిన పేస్ట్ ట్యూబ్‌ను ఈమె అద్భుతంగా వినియోగంలోకి తెచ్చింది. ఈమె ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’.. అంటూ కొందరు, ‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.29 లక్షలకు పైగా లైక్‌లు, 8.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

కుర్చీలో కూర్చున్నా.. పక్కన ఓ కన్నేసి ఉంచాలి.. ఈమె విషయంలో ఏమైందో చూడండి..

బైకును ఢీకొన్న కారు.. మరుక్షణమే బైకర్ చేసిన పని చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 18 , 2026 | 05:15 PM