Woman Theft Video: కుర్చీలో కూర్చున్నా.. పక్కన ఓ కన్నేసి ఉంచాలి.. ఈమె విషయంలో ఏమైందో చూడండి..
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:15 PM
కొందరు మహిళలంతా కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని భోజనం చేస్తున్నారు. వారి వెనుకే కూర్చున్న మరో మహిళ.. చూసేందుకు ఎంతో హుందాగా ఉంది. అయితే చివరకు ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..
కొందరు హడావుడిలో ఉన్నప్పుడు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. ఇంకొందరైతే, తమ చేతిలోని వస్తువులను పక్కన ఉన్న వారు తస్కరిస్తున్నా కూడా గమనించలేనంత పరధ్యానంలో ఉంటారు. ఇలాంటి సందర్భాలను కొందరు దొంగలు.. తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. అదును చూసి పర్సులు, నగదు, నగలను ఎత్తుకెళ్తుంటారు. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చోరీ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు మహిళలంతా కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిలో ఓ మహిళ తన హ్యండ్ బ్యాగును కుర్చీకి తగిలించి భోజనం చేస్తోంది. వారి వెనుకే కూర్చున్న మరో మహిళ.. ఆ బ్యాగుపై కన్నేసింది. కాసేపు చుట్టూ గమనించి.. అవకాశం కోసం వేచి చూసింది. ఆ మహిళలంతా పరధ్యానంలో ఉండడం గమనించి, మెల్లిగా కుర్చీకి తగిలించిన బ్యాగును తీసి నేలపై పెట్టింది.
బ్యాగును నేలపై పెట్టిన తర్వాత కొద్ది సేపు ఆగి ఓ సంచి తీసుకుంది. చివరగా నేలపై ఉన్న బ్యాగును తీసుకుని తన సంచిలో వేసుకుని.. (Woman Stole Bag) అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. ఆమె వెళ్లిన కాసేపటికి భోజనం చేస్తున్న మహిళ.. తన బ్యాగును చెక్ చేసుకుంది. మొత్తం వెతికినా కనిపించకపోయేసరికి షాక్ అయింది. ఈ వీడియో ఇంతటితో ముగిసింది. ఇలా సదరు మహిళ పరధ్యానంలో ఉంటూ తన బ్యాగును పోగొట్టుకుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె చోరీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇంత అందంగా ఉన్న మహిళ.. ఇలా చోరీ చేస్తుందని ఊహించగలమా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..
పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..