Experiment Viral Video: అది నోరా లేక క్రషరా.. గాజు ముక్కలను ఏం చేస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:04 PM
ఓ వ్యక్తి ప్లేటులో గాజు సీసాలను పెట్టుకుని కూర్చున్నాడు. వాటితో ఏం చేస్తాడబ్బా.. అని ఆలోచిస్తుండగానే అంతా అవాక్కయ్యే పని చేశాడు. గాజు ముక్కలను రొట్టె ముక్కల తరహాలో కరకరా నమిలేశాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు..
సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏ వీడియో నెట్టింట్లోకి వచ్చి చేరుతుందో, ఏ వీడియో ఇట్టే వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. కొందరు ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేసి వీడియోలు చేసినా.. నెటిజన్లు తెగ చూసేస్తుంటారు. కొన్నిసార్లు కొన్ని విన్యాసాలు, వింత వింత ప్రయోగాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలను రోజులో ఏదో ఒక సమయంలో చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గాజు ముక్కలను రొట్టె ముక్కల మాదిరి నమిలేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో..! ఇదేం ప్రయోగంరా నాయనా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అది నోరా లేక క్రషరా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్లేటులో గాజు సీసాలను పెట్టుకుని కూర్చున్నాడు. వాటితో ఏం చేస్తాడబ్బా.. అని ఆలోచిస్తుండగానే అంతా అవాక్కయ్యే పని చేశాడు. గాజు ముక్కలను రొట్టె ముక్కల తరహాలో కరకరా నమిలేశాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు చాలా గాజు ముక్కలను రొట్టె ముక్కల మాదిరి నమిలేశాడు.
ఇతను చేసిన వింత నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. గాజు ముక్కలను నమిలే క్రమంలో (Man Chewed Glass Pieces) నోటిలో ఏమాత్రం గుచ్చుకున్నా.. సమస్య చాలా పెద్దదవుతుంది. అయితే అతను ఏమాత్రం భయం లేకుండా గాజు ముక్కలను కరకరా నమిలేశాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. వీడేంట్రా మరీ విచిత్రంగా ఉన్నాడు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’.. అంటూ మరికొందరు, ‘చూస్తుంటే ఇది గ్రాఫిక్స్ వీడియోలా ఉంది’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కుర్చీలో కూర్చున్నా.. పక్కన ఓ కన్నేసి ఉంచాలి.. ఈమె విషయంలో ఏమైందో చూడండి..
బైకును ఢీకొన్న కారు.. మరుక్షణమే బైకర్ చేసిన పని చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..