Share News

దాబాలోకి దూసుకొచ్చిన లారీ.. చివరికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 24 , 2026 | 04:42 PM

రోడ్డు పక్కనే ఉన్న దాబాలో చాలా మంది ట్రక్ డ్రైవర్లు కూర్చుని టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా అంతా సరదాగా ఉన్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ దాబా వద్దకు రాగానే.. ఒక్కసారిగా టైరు పేలిపోయింది. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..

దాబాలోకి దూసుకొచ్చిన లారీ.. చివరికి ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రమాదాలు చెప్పి రావు అనే విషయం అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు ఊహించని విధంగా కళ్ల ముందే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఇలాంటి సమయాల్లో అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా.. ఎవరికీ ఏమీ కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ లోడు లారీ వేగంగా వెళ్తున్న సమయంలో సడన్‌గా టైరు పేలిపోయి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కనే ఉన్న దాబాలో చాలా మంది ట్రక్ డ్రైవర్లు కూర్చుని టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇలా అంతా సరదాగా ఉన్న సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లోడుతో వెళ్తున్న లారీ దాబా వద్దకు రాగానే.. ఒక్కసారిగా టైరు పేలిపోయింది. దీంతో లారీ అదుపు తప్పి (lorry crashed into dhaba) దాబాలోకి దూసుకొచ్చింది. అప్పటిదాకా సరదాగా ఉన్న డ్రైవర్లు.. లారీ టైరు పేలిన శబ్ధానికి వెనక్కు తిరిగి చూశారు.


వారు వెనక్కు తిరిగి చూడగానే.. అప్పటికే లారీ వారి వైపు దూసుకొచ్చింది. లారీ తమ వైపు రావడం చూసి అంతా (Drivers escaped from lorry accident) పరుగు పరుగున దూరంగా పారిపోయారు. చివరకు ఆ లారీ సరిగ్గా వారు కూర్చున్న కుర్చీలను ఢీకొట్టి ముందుకు వెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో వాళ్లు అప్రమత్తంగా లేకపోయి ఉండి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఎట్టకేలకు అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ వీళ్ల టైం బాగుంది.. లక్కీగా బయటపడ్డారు’.. అంటూ కొందరు, ‘అదృష్టం అంటే ఇదే.. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వార్త రాసే సమయానికి ఈ వీడియో.. 2700కి పైగా లైక్‌లు, 6.49 లక్షలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2026 | 04:43 PM