Lion And Buffalo Viral Video: గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Jan 18 , 2026 | 09:10 PM
కలిసి ఉంటే కలదు సుఖం.. అని పెద్దలు అంటుంటారు. ఐకమత్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా అవలీలగా ఎదుర్కోవచ్చనేది దాని అంతరార్థం. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. సింహాల గుంపు గేదెపై దాడి చేసింది. తీరా చంపేసే సమయంలో..
అడవికి రాజు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది సింహం. అది ఒకసారి గర్జించిందంటే.. ఒంట్లో వణుకు పుట్టాల్సిందే. ఇక పొరపాటున కంటికి కనిపించిందంటే.. ప్రాణం పోయినంత పనవుతుంది. అడవిలో సింహం డామినేషన్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అయితే పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు సింహాలు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుంది. మరికొన్నిసార్లు భయంతో పారిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సింహాలకు చిక్కిన తమ సహచరుడిని విడిపించుకునేందుకు గేదెలన్నీ కలిసికట్టుగా వచ్చాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని (South Africa) ప్రఖ్యాత సాబి సాండ్స్ గేమ్ రిజర్వ్‌లో చోటు చేసుకుంది. 20 పైగా సింహాలు కలిసి ఓ పెద్ద గేదెను వేటాడి, (Lions attack buffalo) చుట్టూ చేరి చంపేందుకు సిద్ధంగా ఉన్నాయి. తీరా దాని ప్రాణాలు తీసే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సింహాలకు చిక్కిన తమ సహచరుడిని విడిపించుకునేందుకు గేదెలన్నీ కలిసికట్టుగా యుద్ధానికి దిగాయి. అన్నీ కలిసి సింహాల సమీపానికి వచ్చాయి. ముందుగా వాటిలో ఓ గేదె తెగించి.. నేరుగా వెళ్లి, సింహాల పైకి దాడి చేసేందుకు వెళ్లింది.
ఆ గేదె వెనుక మందను చూడగానే సింహాలన్నీ జడుసుకున్నాయి. ఈ ఊహించని పరిణామంతో సింహాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచాయి. గేదెలను తరిమికొట్టాలని కొద్ది సేపు ప్రయత్నించాయి. కానీ వాటి ఆవేశం ముందు చివరకు తోక ముడవాల్సి వచ్చింది. గేదెలన్నీ రౌండప్ చేయడంతో పట్టుకున్న (Buffaloes chased away lions) గేదెను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. పరిస్థితి చూస్తుంటే.. ఈ ఘటనలో ఆ గేదె ప్రాణాలతో బయటపడినట్లు కనిపిస్తోంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బలం ఒక్కటే కాదు.. ధైర్యం, ఐక్యత, సరైన సమయంలో తీసుకునే నిర్ణయం.. ఇవే నిజమైన శక్తి’.. అంటూ కొందరు, ‘ధైర్యమే నిజమైన రాజు.. అందుకు ఈ వీడియోనే నిదర్శనం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 94 వేలకు పైగా లైక్‌లు, 4.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..
అది నోరా లేక క్రషరా.. గాజు ముక్కలను ఏం చేస్తున్నాడో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..