మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
ABN , Publish Date - Jan 24 , 2026 | 03:39 PM
కొందరు వ్యక్తులు పడవలో సముద్రంలోకి వెళ్లారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత.. చేపల కోసం వెతుకుతున్న క్రమంలో వారికి దూరంగా ఓ పెద్ద తిమింగలం కనిపించింది. అది ఎటూ కదలకుండా ఉండడం చూసిన వారు.. చివరకు ఏం చేశారో మీరే చూడండి..
మామూలుగా ఉన్న వారు మందేశారంటే మరో లోహంలో విహరిస్తుంటారు. కొందరు గొంతులో చుక్క దిగిందంటే చాలు.. తమని తాము మర్చిపోతుంటారు. ఇంకొందరు ఎదురుగా ఎవరున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా రచ్చరచ్చ చేస్తుంటారు. మందుబాబుల ఆగడాలు అన్నీఇన్నీ అని చెప్పలేం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు నిత్యం తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సముద్రంలో ఇద్దరు వ్యక్తులు మందు తాగి, చనిపోయిన తిమింగలం వద్ద చేసిన నిర్వాకం.. అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు పడవలో సముద్రంలోకి వెళ్లారు. సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత.. చేపల కోసం వెతుకుతున్న క్రమంలో వారికి దూరంగా ఓ పెద్ద తిమింగలం కనిపించింది. అది ఎటూ కదలకుండా ఉండడం చూసిన వారు.. ఏమైందో తెలుసుకునేందుకు సమీపానికి వెళ్లారు. తీరా చూస్తే ఆ తిమింగలం చనిపోయి కనిపించింది. అప్పటికే మందులో ఉన్న వారు.. పడవను తిమింగలం సమీపానికి పోనిచ్చారు.
వారిలో ఇద్దరు వ్యక్తులు తిమింగలం పైకి ఎక్కి కూర్చున్నారు. తర్వాత దానిపై సరదాగా అటూ, ఇటూ కదులుతూ (Drunken man sitting on dead whale) ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. ఇలా వారిద్దరూ చాలా సేపు చనిపోయిన తిమింగలంపై కూర్చుని వీడియోలు తీసుకున్నారు. వీడియో పోస్ట్ చేసిన వారు.. ఆ తిమింగలం కొన్ని గంటల క్రితమే చనిపోయినట్లు ఉందని.. అందుకే వాసన కూడా రాలేదని చెప్పారు. తాము తాగి ఉన్నట్లు కూడా అంగీకరించారు. వీరి నిర్వాకం చూసిన వారంతా మండిపడుతున్నారు. ఇక జంతు ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షణకారులు అయితే.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలా చేయడం కరెక్ట్ కాదు.. చనిపోయిన జీవుల పట్ల కూడా సానుభూతి ఉండాలి’.. అంటూ కొందరు, ‘చనిపోయిన తిమింగలం ఎప్పుడైనా పేలిపోవచ్చు.. ఇలా చేయడం ప్రమాదం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8,600కి పైగా లైక్‌లు, 5.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..