Share News

ఈ చిత్రంలో దాగి ఉన్న చేపను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే లెక్క..

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:39 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సముద్రం అడుగు భాగంలో అనేక జీవులు కనిపిస్తుంటాయి. తాబేలు, జెల్లీఫిష్, ఆక్టోపస్, నక్షత్ర చేపలు తదితర జీవులు కనిపిస్తాయి. అయితే..

ఈ చిత్రంలో దాగి ఉన్న చేపను 10 సెకన్లలో కనుక్కుంటే.. మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే లెక్క..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటూ ఏకాగ్రతను పెంపొందిస్తాయి. అలాగే పనిపై శ్రద్ధ పెరిగేలా చేయడంలోనూ సాయం చేస్తాయి. అందుకే ఇలాంటి చిత్రాలకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా ఇలాంటి చిత్రాల పట్ల ఆసక్తిని కనబరుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మీకోసం ఓ ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తు్న్న చిత్రంలో నీళ్ల అడుగు భాగంలోని దృశ్యం కనిపిస్తుంటుంది. అయితే ఈ చిత్రంలో ఓ చేప కూడా దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో సముద్రం అడుగు భాగంలో అనేక జీవులు కనిపిస్తుంటాయి. తాబేలు, జెల్లీఫిష్, ఆక్టోపస్, నక్షత్ర చేపలు తదితర జీవులు కనిపిస్తాయి. అలాగే వివిధ రకాల మొక్కలను కూడా చూడొచ్చు. ఇదే చిత్రంలో (Hidden Fish) ఓ చేప కూడా దాక్కుని ఉంది.


అయితే ఆ చేప అంత సులభంగా మీ కంటికి కనిపించదు. అలాగని అక్కడ అసలు చేప లేదేమో అనుకుంటే పొరపాటే. కాస్త తీక్షణంగా చూస్తే ఆ చేపను ఇట్టే పసిగట్టేయవచ్చు. చాలా మంది ఆ చేపను కనిపెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు.


ఇంకెందుకు ఆలస్యం.. ఆ చేపను కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ చేపను కనుక్కోలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.


optical-illusuon-photo.jpg


ఇవి కూడా చదవండి..

ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

మరిన్ని పజిల్ చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2026 | 03:39 PM