Share News

బీరు బాటిళ్లతో ఇలా ఎవరైనా చేస్తారా.. 282 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై..

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:20 PM

ఓ వ్యక్తి ఎత్తైన బిల్డింగ్‌పైకి ఎక్కాడు. బిల్డింగ్‌ చివర అంచున ఉన్న ఇనుక కడ్డీలపై కూర్చున్నాడు. అతడి ముందు మూడు బీరు బాటిళ్లు ఉన్నాయి. చూసిన వారంతా.. ఆ వ్యక్తి బీరు తాగుతున్నాడేమో అనుకున్నారు. అయితే అంతా చూస్తుండగానే..

బీరు బాటిళ్లతో ఇలా ఎవరైనా చేస్తారా.. 282 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పై..

ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కొందరు తమలోని టాలెంట్‌ను బయటికి తీసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు ప్రాణాలకు తెగించి డేంజరస్ స్టంట్స్ చేస్తూ నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్నారు. ఇంకొందరైతే.. ఎవరికీ సాధ్యం కాని పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎత్తైన బిల్డింగ్‌పై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన హర్యానాలోని (Haryana) హిసార్‌ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ యువకుడు.. స్థానికంగా ఉన్న 282 అడుగుల ఎత్తైన బిల్డింగ్‌పైకి ఎక్కాడు. బిల్డింగ్‌ పైఅంతస్తులో సేఫ్టీ గ్రిల్స్ దాటి బయటికి వెళ్లి.. చివర అంచున ఉన్న ఇనుక కడ్డీలపై కూర్చున్నాడు. అతడి ముందు మూడు బీరు బాటిళ్లు ఉన్నాయి. చూసిన వారంతా.. ఆ వ్యక్తి బీరు తాగుతున్నాడేమో అనుకున్నారు. అయితే అంతా చూస్తుండగానే అతను.. మూడు బాటిళ్లు తీసుకుని పైకి లేచి కాస్త ముందుకు వెళ్లాడు.


చూస్తేనే కళ్లు తిరిగే ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి నడవడమే కాకుండా.. బాటిళ్లను కింద పెట్టి డేంజరస్ స్టంట్ చేశాడు. మధ్యలో ఉన్న బాటిల్‌పై తల పెట్టి.. మిగతా రెండు బాటిళ్లపై చేతులు పెట్టి.. తలకిందులుగా నిల్చున్నాడు. ఇలా కొద్ది సేపు ఉన్న తర్వాత.. మళ్లీ ఇంకొన్ని (Young Man Stunts on Tall Building) భయంకరమైన స్టంట్స్ చేశాడు. ఇనుప గ్రిల్స్‌ను పట్టుకుని కిందకు వేలాడాడు. అంతటితో ఆగకుండా చేతులతో గ్రిల్ పట్టుకుని తలకిందులుగా విన్యాసాలు చేశాడు. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా పైనుంచి కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే అతడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు విన్యాసాలు చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. చూస్తుంటేనే భయమేస్తోంది.. ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’.. అంటూ కొందరు, ‘ఇది ప్రతిభ కాదు.. మూర్ఖత్వం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 440కి పైగా లైక్‌లు, 61 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 20 , 2026 | 04:21 PM