Share News

గులాబ్ జామున్ తిన్న విదేశీయుడు.. చివరకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడో చూడండి..

ABN , Publish Date - Jan 25 , 2026 | 06:11 PM

ఓ బ్రిటిష్ వ్యక్తి మాంచెస్టర్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లాడు. లోపల గులాబ్ జామున్ బాక్స్‌ను కొన్నాడు. బాక్స్ ఓపెన్ చేసి, దాని టేస్ట్ చూడగానే ఎలాంటి ఎక్స్‌‌ప్రెషన్ ఇచ్చాడో మీరే చూడండి..

గులాబ్ జామున్ తిన్న విదేశీయుడు.. చివరకు ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడో చూడండి..

భారతీయ వంటకాలకు ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విదేశీయులు కూడా మన వంటకాలకు ఫిదా అవుతుంటారు. ఇందుకు నిదర్శనంగా అనేక సంఘటనలను మనం తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో దేశ విదేశాలకు సంబంధించిన వీడియోలన్నీ మన ఫోన్లలోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో భారతీయ వంటకాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ విదేశీయుడు గులాబ్ జామున్‌ను రుచి చూడగానే ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ బ్రిటిష్ వ్యక్తి మాంచెస్టర్‌లోని (Manchester) ఒక భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లాడు. లోపల గులాబ్ జామున్ బాక్స్‌ను (Gulab Jamun Sweet Box) 16 పౌండ్లు వెచ్చించి (సుమారు రూ.2,000లు) కొన్నాడు. బాక్స్ ఓపెన్ చేసి, అందులో ఒక పీస్‌ను తీసుకుని నోట్లో వేసుకున్నాడు.


గులాబ్ జామున్‌ను నోట్లో వేసుకోగానే దాని రుచికి అతను మైమరచిపోయాడు. వావ్.. వాట్ ఏ టేస్ట్ అనుకుంటూ అందులోని జామున్‌లను అన్నింటినీ లొట్టలేసుకుంటూ తినేశాడు. జామున్‌ను తిన్న ప్రతిసారీ.. దాని రుచిని ఆస్వాదిస్తు్న్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. తాను భారతీయ జామూన్లకు ఫిదా అయిపోయినట్లు చెప్పకనే చెప్పాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చూస్తుంటేనే నోటిలో నీళ్లు ఊరిపోతున్నాయి’.. అంటూ కొందరు, ‘గులాబ్ జామునా.. మజాకా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 వేలకు పైగా లైక్‌లు, 6.33 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2026 | 06:11 PM