Share News

తాగొచ్చాడని భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తుపాకీ ఫొటోతో కోడలికి షాక్ ఇచ్చిన అత్త.. అసలేమైందంటే..

ABN , Publish Date - Jan 25 , 2026 | 07:00 PM

మద్యానికి బానిసైన భర్త.. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య.. ఇటీవల ఓ రోజు భర్తను మంచానికి కట్టేసింది. అయితే కొడుకును కోడలు మంచానికి కట్టేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. చివరకు ఏం చేసిందంటే..

తాగొచ్చాడని భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తుపాకీ ఫొటోతో కోడలికి షాక్ ఇచ్చిన అత్త.. అసలేమైందంటే..

భార్యాభర్తల మధ్య నిత్యం అనేక రకాల గొడవలు జరుగుతుంటాయి. ప్రధానంగా భర్త తాగుడు విషయంలోనే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయి. అయితే గొడవ జరిగిన సమయంలో కొన్నిసార్లు తల్లిదండ్రులు కలుగుజేసుకుని సర్దిచెబుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భర్త రోజూ తాగి వస్తున్నాడనే కోపంతో భార్య.. అతన్ని మంచానికి కట్టేసింది. అయితే కోడలిపై కోపంతో అత్త ప్రతీకారం తీర్చుకుంది. కోడలు తుపాకీతో ఉన్న ఫొటోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అలీఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అలీఘర్ జిల్లాలోని టప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి హమీద్‌పూర్ గ్రామంలో ప్రదీప్ అనే వ్యక్తి.. భార్య సోని, తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన ప్రదీప్.. రోజూ తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. రోజూ గొడవ చేస్తుండడంతో విసిగిపోయిన భార్య.. ఇటీవల ఓ రోజు (wife tied her husband to bed) తన భర్తను మంచానికి కట్టేసింది.


మంచానికి కట్టేసిన తర్వాత భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే కొడుకును కోడలు మంచానికి కట్టేయడాన్ని.. ప్రదీప్ తల్లి జీర్ణించుకోలేకపోయింది. ఎలాగైనా కోడలికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. గతంలో ఆమె నాటు తుపాకీతో ఉన్న ఫొటోలు, వీడియోలను పోలీసులకు చూపించింది. తన కొడుకును తుపాకీతో (Mother-in-law files police complaint against daughter-in-law) బెదిరిస్తూ వేధిస్తోందని ఫిర్యాదు చేసింది.


ప్రదీప్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటికి వెళ్లి తుపాకీ కోసం తనిఖీలు చేశారు. అయితే ఇంట్లో అలాంటిదేమీ లభించలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రదీప్‌పై అతడి భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజూ తాగి వచ్చి వేధిస్తున్నాడని, అందుకే మంచానికి కట్టేయాల్సి వచ్చిందని చెప్పింది. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, దంపతుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 25 , 2026 | 07:00 PM