తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు..
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:08 AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమర్ తమ్ముడు, మాజీ ఎంపీ డీకే సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం శాశ్వతం కాదు.. తలరాత రాసి ఉంటే మా అన్న సీఎం అవుతారు.. అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కన్నడనాట ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
- అధికారం శాశ్వతం కాదు..
- మాజీ ఎంపీ డీకే సురేశ్
బెంగళూరు: అధికారం శాశ్వతం కాదు, అంతకుమించి ఓపిక కూడా శాశ్వతమని చెప్పలేమని తలరాత రాసి ఉంటే మా అన్న డీకే శివకుమార్ సీఎం అవుతాడని మాజీ ఎంపీ డీకే సురేశ్(DK Suresh) అన్నారు. సదాశివనగర్‌లోని నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారన్నారు. ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుని వేచిచూస్తున్నామన్నారు. రాజకీయాలే కాదు ఏ రంగంలోనైనా ఉన్నతస్థానం అంత సులువుగా దక్కదు.
ముఖ్యమంత్రి పదవి మా అన్నకు అంత సులువుగా లభించనుందని చెప్పలేం. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. మా లక్ష్యం 2028 ఎన్నికలు అన్నారు. పార్టీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని ఓపికగా ఉన్నామన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున క్రమశిక్షణ కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రప్రభుత్వం ఉపాధి పథకంలో మార్పుల ద్వారా రైతు కూలీలకు అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి రాష్ట్ర రాజకీయాలకు తిరిగి వస్తే స్వాగతమన్నారు.

మేము జాతీయ రాజకీయాల్లోకి వెళ్లమని సూచించినవారం కాదని, అలా అని రాష్ట్ర రాజకీయాలకు రావాలని కోరమన్నారు. వారి పార్టీకి ఆయనే అధిపతి అని, ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉందన్నారు. శాసనసభ సమావేశాలు ముగిశాక అధిష్ఠానం ఢిల్లీకి పిలించే అవకాశం ఉందన్నారు. అవకాశం ఎప్పుడు, ఎలా వస్తుందో చెప్పలేమంటూ సమావేశాన్ని ముగించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News