Share News

MLA Gali: ఎమ్మెల్యే ‘గాలి’ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN , Publish Date - Jan 08 , 2026 | 01:34 PM

గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్‌రెడ్డి మరణించారని, మిస్‌ ఫైరింగ్‌ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.

MLA Gali: ఎమ్మెల్యే ‘గాలి’ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

- మిస్‌ ఫైరింగ్‌లో రాజశేఖర్‌రెడ్డికి తూటా తగల్లేదు

- ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి

బళ్లారి(బెంగళూరు): జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్‌రెడ్డి మరణించారని, మిస్‌ ఫైరింగ్‌ కారణంగా మరణించలేదని ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(MLA Gali Janardhan Reddy) అన్నారు. ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సూచనల మేరకు తన ప్రైవేట్‌ గన్‌మెన్‌ ఆయనను ఉద్దేశపూర్వకంగా కాల్చాడన్నారు. బుధవారం ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన నివాసం వద్ద రాజశేఖర్‌రెడ్డిపై కాల్పులు జరిపిన వీడియోను చూపించి కాల్పులకు, అల్లర్లకు సతీశ్‌రెడ్డికి సంబంధం లేదన్నారు.


pandu2.3.jpg

అల్లర్లు జరిగిన తరువాత సతీశ్‌రెడ్డి రాత్రి 8 గంటలకే వెళ్లిపోయారన్నారు. రాత్రి 9గంటల తరుఆత వచ్చిన నగర ఎమ్మెల్యే నారాభరత్‌రెడ్డి ఏదో విధంగా మహర్షి కాల్మీకి విగ్రహ ఉత్సవాన్ని ఆపాలని, మాపై అపవాదు వ్యాపింపచేయాలని చూశారన్నారు. గన్‌మెన్‌కు సూచించిన విధంగా ప్రతిరోజు తనకార్యాలయానికి వచ్చే రాజశేఖర్‌రెడ్డిపై కాల్పులు జరిపారన్నారు. దీనిని చూసిన ఒకపోలీస్‌ సాక్షిగా ఉన్నాడని చెప్పారు.


pandu2.2.jpg

తాగిన గంజాయి మత్తులో జనార్దన్‌రెడ్డి ఇంటిని తగలబెట్టి బూడిద చేస్తానని భరత్‌రెడ్డి చెప్పారని ఆయన ఆరోపించారు. జనార్దనరెడ్డిని కాల్చారా అని డీకేసీ అడిగారంటే ఆయన నా చావును కోరుకుంటున్నట్లు ఉందన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. జరిగిన ఈ అల్లర్ల నేపథ్యంలో 17న బీజేపీ పెద్ద ఎత్తున నిరసన తెలపనున్నట్లు వివరించారు. మాజీ మంత్రి శ్రీరాములు, చిన్న పక్కీరప్ప పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం

ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 08 , 2026 | 01:41 PM