Bengaluru News: సినిమా హాల్ లేడీస్ టాయ్‌లెట్‌లో.. వీడియో రికార్డింగ్
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:07 PM
సినిమా హాల్ మహిళల టాయ్‌లెట్‌లో.. సెల్‌ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసిన ఒకరిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే.. ఈ తప్పుడు పనులకు పాల్పడింది నేపాల్ కు చెందిన 17 సంవత్సరాల బాలుడు కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- నేపాలీ యువకుడి అరెస్టు
బెంగళూరు: నగరంలోని మడివాళ ప్రాంతం సంధ్యా టాకీస్ లేడీస్ టాయ్‌లెట్‌లో ఓ యువకుడు రహస్య కెమెరా(Camera)తో రికార్డింగ్ చేశాడు. సంధ్యా టాకీస్‌లో తెలుగు సినిమా చూసేందుకు గత ఆదివారం రాత్రి ఓ కుటుంబం వెళ్లింది. విశ్రాంతివేళ మహిళ శౌచాలయానికి వెళ్లినప్పుడు గోడపై ఆన్ చేసి ఉన్న మొబైల్‌ను గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే కేకలు వేయగా, శౌచాలయం పక్కనే ఉన్న నేపాలీ యువకుడిని థియేటర్ సిబ్బంది పట్టుకున్నారు. మొబైల్ కెమెరా(Mobile camera) ఉంచిన నేపాలీ యువకుడిని మడివాళ పెట్రోలింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకోసం ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నేపాల్‌కు చెందిన 17ఏళ్ల బాలుడితోపాటు మరొకరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని బాలమందిరానికి తరలించారు. తప్పించుకున్న మరో యువకుడి కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. శౌచాలయంలో లభించిన మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News