Share News

Gold, Silver Rates Dec 18: పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:36 AM

అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెంచుతున్నాయి. ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold, Silver Rates Dec 18: పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Gold, Silver Rates on Dec 18

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బుధవారం కూడా రేట్‌లు భారీగా పెరిగాయి. బంగారాన్ని మించిపోయిన వెండి మదుపర్లకు లాభాలను కురిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం (డిసెంబర్ 18) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 660 మేర పెరిగి రూ.1,34,520కు చేరుకుంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర రూ. 610 మేర పెరిగి రూ.1,23,310కు చేరింది. వెండి ధర మాత్రం అసాధారణ రీతిలో పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.9 వేల మేర పెరిగి రూ.2,08,100కు చేరుకుంది (Gold, Silver Rates Dec 18).

అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందన్న సంకేతాలు బంగారం, వెండికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో స్వల్పంగా పెరిగిన నిరుద్యోగిత, డాలర్ బలహీనపడ్డ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, వెండి వైపు మళ్లుతున్నారు. ఇక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు కూడా కీలకమైన వెండి సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల రేట్లు మరింత పెరిగాయి. రాబోయే రోజుల్లో కూడా పసిడి, వెండికి గిరాకీ ఇదే రీతిలో కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి (24కే, 22కే, 18కే) ధరలు

  • చెన్నై: ₹1,35,290; ₹1,24,010; ₹1,03,510

  • ముంబై: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • న్యూఢిల్లీ: ₹1,34,670; ₹1,23,460; ₹1,01,040

  • కోల్‌కతా: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • బెంగళూరు: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • హైదరాబాద్: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • విజయవాడ: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • కేరళ: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • పుణె: ₹1,34,520; ₹1,23,310; ₹1,00,890

  • వడోదరా: ₹1,34,570; ₹1,23,360; ₹1,00,940

  • అహ్మదాబాద్: ₹1,34,570; ₹1,23,360; ₹1,00,940

వెండి (కిలో) ధర..

  • చెన్నై: ₹2,22,100

  • ముంబై: ₹2,08,100

  • న్యూఢిల్లీ: ₹2,08,100

  • కోల్‌కతా: ₹2,08,100

  • బెంగళూరు: ₹2,08,100

  • హైదరాబాద్: ₹2,22,100

  • విజయవాడ: ₹2,22,100

  • కేరళ: ₹2,22,100

  • పుణె: ₹2,08,100

  • వడోదరా: ₹2,08,100

  • అహ్మదాబాద్: ₹2,08,100


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.

ఇవీ చదవండి:

సూచీలకు తప్పని నష్టాలు.. వరుసగా మూడో రోజూ నేల చూపులే..

జెప్టో తొలి పబ్లిక్ ఆఫర్‌(IPO)..రూ.4000 కోట్లు లక్ష్యం

Updated Date - Dec 18 , 2025 | 08:33 AM