Zepto IPO: జెప్టో తొలి పబ్లిక్ ఆఫర్(IPO)..రూ.4000 కోట్లు లక్ష్యం
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:09 PM
దేశంలో నిత్యావసర వస్తువుల తక్షణ డెలివరీ సంస్థ అయిన జెప్టో త్వరలో ఐపీవోకు రాబోతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 4వేల కోట్ల రూపాయలు సేకరించాలని నిర్దేశించుకుంది.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 17: దేశంలోని ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ అయిన జెప్టో(Zepto) తొలి పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. తద్వారా దాదాపు 500 మిలియన్ డాలర్లు.. అంటే, సుమారు రూ. 4వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకోసం వచ్చే వారంలోనే కాన్ఫిడెన్షియల్ మార్గంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI)కి ముసాయిదా పత్రాలను సమర్పించాలని చూస్తోంది.
జెప్టో ఈ పబ్లిక్ ఇష్యూలో తాజా షేర్ల జారీ చేయనుంది. అలాగే వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా తమ వాటాను విక్రయిస్తూ షేర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను సర్వీసేస్ విస్తరణకే ఉపయోగిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.
భారత్‌లో క్విక్ కామర్స్ రంగంలో ప్రస్తుతం గట్టి పోటీనే ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్విగ్గీ.. ఇన్‌స్టామార్ట్ ద్వారా క్విక్ కామర్స్ సేవలందిస్తోంది. అలాగే జొమాటో కూడా బ్లింకిట్ ద్వారా క్విక్ కామర్స్‌లో ఉండగా, టాటా గ్రూప్‌నకు చెందిన బిగ్ బాస్కెట్ మార్కెట్లో ఉంది. దీంతో పాటు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నౌ పేరుతో ఎంట్రీ ఇస్తోంది.
అలాగే క్విక్ కామర్స్ సెక్టార్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సైతం ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్, పీఎల్‌సీ సహా గోల్డ్ మన్ శాక్స్ గ్రూపులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Also Read:
శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..