Home » Businesss
కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు (04-12-2024) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. గ్రాముకు కేవలం ఒక రూపాయి మాత్రమే పెరిగి మహిళా మణులకు ఊరట కలిగించింది.
Free Apply for PAN Card 2.O: భారత ప్రభుత్వం పాన్ 2.O ప్రాజెక్టు ద్వారా కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు.. పన్ను చెల్లింపుదారుల గుర్తింపును సురక్షితమైన పద్ధతిలో నిర్వహించేందుకు ఆధునిక, సాంకేతిక విధానాన్ని కల్పిస్తుంది.
మారుతి సుజుకీ మరోసారి రికార్డ్ బ్రేక్ అమ్మకాలను చవిచూసింది. భారత్ లో ఈ సంస్థకు ఉన్న డిమాండ్ ను తెలిపేలా నెల రోజుల్లో దాదాపు 2 లక్షల కార్లను విక్రయించింది..
దేశంలో ఆస్పత్రుల రంగంలో మరో భారీ విలీనం చోటు చేసుకుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఏస్టర్ డీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్ చెయిన్, బ్లాక్‌స్టోన్ నిర్వహణలోని క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్‌లో (కేర్ హాస్పిటల్స్) విలీనమవుతోంది.
భారత ఆర్థిక ప్రగతి చక్రం వేగం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 7 త్రైమాసికాల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి జారుకుంది.
దేశంలో సబ్బుల ధర పెరిగింది. హిందూస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), విప్రో కన్స్యూమర్, గోద్రెజ్‌తో సహా అన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు స్నానపు సబ్బుల ధర ఏడు నుంచి ఎనిమిది శాతం పెంచేశాయి.
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి 13 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్ఠ స్థాయి 84.60కి దిగజారింది.
ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ను శుక్రవా రం పరుగులు తీయించాయి. సెన్సెక్స్ 759 పాయింట్ల లాభంతో 79,802 వద్ద ముగియగా నిఫ్టీ 216.95 పాయింట్ల లాభంతో 24,131,10 వద్ద ముగిసింది.
హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెట్ (హెచ్ఎస్ఎల్) డైరక్టర్‌గా గంటి వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
పారిశ్రామికోత్పత్తికి కీలకమైన 8 రంగా ల ఉత్పత్తి వృద్ధిరేటు ఈ అక్టోబరులో 3.1 శాతానికి పడిపోయింది.