Share News

వరుసగా మూడో రోజూ లాభాల జోరు.. 25,900 పైన నిఫ్టీ

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:31 PM

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ్టికి వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 208 పాయింట్లు పెరిగి 84,274 వద్ద ముగిసింది, నిఫ్టీ 25,900 పైకి చేరింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడంతో సూచీలు గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి.

వరుసగా మూడో రోజూ లాభాల జోరు.. 25,900 పైన నిఫ్టీ
Sensex today, Nifty above 25900

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 10: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ్టికి వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. BSE సెన్సెక్స్ 208.17 పాయింట్లు (0.25%) పెరిగి 84,273.92 వద్ద క్లోజ్ అయింది. NSE నిఫ్టీ 67.85 పాయింట్లు (0.26%) ఎగిసి 25,935.15 వద్ద స్థిరపడింది. అంతేకాదు, ఈ రోజు నిఫ్టీకి 26,000 సమీపంలో ట్రేడ్ అయిన రోజుగా నిలిచింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన దేశీయ సూచీలకు ఊతాన్నిచ్చాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలపై అంచనాలు, భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపారు.


మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలు:

బ్రాడ్-బేస్డ్(లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్) బయ్యింగ్, గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ క్యూస్‌లు, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఇన్‌ఫ్లోస్, ఇండియా-యుఎస్ ఇంటరిమ్ ట్రేడ్ డీల్ వల్ల FDI, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనాలు కారణాలుగా చెబుతున్నారు. ఫార్మా, PSU బ్యాంక్స్ తప్ప మిగిలిన అన్ని సెక్టారల్ ఇండెక్స్‌లు ఇవాళ గ్రీన్‌లో ముగిశాయి.


ఈ వార్తలూ చదవండి:

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

Updated Date - Feb 10 , 2026 | 04:37 PM