పసిడి, రజతం కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:50 AM
ఇటీవల ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా నేలకు దిగి వస్తున్నాయి. తాజాగా పుత్తడి, రజతం ధరలు నిన్నటి కంటే ఈ రోజు మరి కాస్తా తగ్గాయి. ఈ రోజు వీటిని కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
అమెరికా ఆర్థిక గణాంకాలు వెలువడుతున్న వేళ.. భారత దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు.. సోమ, మంగళవారాల్లో ఆకాశం నుంచి భూమికి దిగి వస్తున్నాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకున్న అనిశ్చితి దీనికి కారణమని అంచనాలు వెలువడుతున్నాయి.
దేశీ మార్కెట్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,060 పలుకుతోంది. ఇదే బంగారం ధర సోమవారం రూ.1,56,590గా ఉంది. అంటే ఈ రోజు బంగారం ధర రూ. 1,530 మేర తగ్గింది. ఇక వెండి సోమవారం రూ. 2,68,000గా ఉండగా.. మంగళవారం రూ. 2,60,000 పలుకుతోంది. అంటే కిలో వెండి ధర ఈ రోజు రూ. 8 వేలు తగ్గింది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,54,910గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1,530 తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ. 1,400 తగ్గింది. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,060కి పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,42,150గా ఉంది.
అలాగే వెండి ధరలోనూ భారీ తగ్గుదల నమోదు చేసుకుంది. రూ.2.7 లక్షల మార్క్ దిగువనే కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ. 8 వేల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,65000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,60000గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
2035 నాటికి రిటైల్ వ్యాపారం..
For More Business News And Telugu News