Share News

ఇవాళ మధ్యాహ్నానికి కొంత రికవరీ చూసిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:47 PM

చుక్కలనంటిన బంగారం ధరలు గత ఐదు రోజులుగా దిగివస్తున్నాయి. అదే తీరుని కనబరుస్తూ ఇవాళ కూడా ధరల సరళి కొనసాగుతోంది. అయితే, నిన్నలాగే ఈ మధ్యాహ్నానికి ధరల్లో కొంత మేర రికవరీ కనిపిస్తోంది.

ఇవాళ మధ్యాహ్నానికి కొంత రికవరీ చూసిన బంగారం, వెండి ధరలు
gold prices today India

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 3: రికార్డు స్థాయి ధరలకు చేరుకుని గత ఐదు రోజులుగా భారీగా పతనమవుతోన్న బంగారం, వెండి ధరలు అదే తీరును కొనసాగిస్తున్నాయి. అయితే సోమ, మంగళవారాల్లో కొంత మేర రికవరీ కూడా చూస్తున్నాయి. ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ వార్తలు, గ్లోబల్ అనిశ్చితి, డాలర్ బలం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇవాళ(మంగళవారం) 24K బంగారం రూ.15,153 నుంచి రూ.15,175 వరకు (గ్రామ్‌కు) ట్రేడ్ అయ్యింది. 10 గ్రాములకు రూ.1,51,530 వరకు పడిపోయింది (కొన్ని సెషన్లలో రూ. 9,000కు పైగా తగ్గుదల). MCXలో కూడా భారీ సెల్లింగ్ ఒత్తిడి ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1,420లు తగ్గింది.

అయితే, ఇవాళ (3 ఫిబ్రవరి 2026) మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో రికవరీతో రూ.15,175 నుంచి రూ. 15,393 వరకు పెరిగింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. 22 క్యారెట్ రూ.13,910 నుంచి రూ.14,110 వరకు ఉంది.


ఇక, వెండి ధరలు (పర్ కిలోగ్రామ్) నిన్న (2 ఫిబ్రవరి 2026) బంగారం కంటే ఎక్కువ పతనం చవి చూసింది. రూ. 3,00,000 నుంచి రూ. 2,60,000 వరకు పడిపోయింది (కొన్ని ఫ్లాట్ ఫామ్స్ లలో రూ. 2.33 లక్షల వరకు). గ్రామ్‌ రూ.300 వద్ద ట్రేడ్ అయింది. MCXలో 6-17% తగ్గుదల నమోదైంది.

ఈరోజు (3 ఫిబ్రవరి 2026) మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి కొంత రికవరీతో రూ.2,80,000కు పెరిగింది. గ్రామ్‌ రూ.280గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ $83-84/ఔన్స్ వద్ద రికవర్ అయింది.

ప్రధాన కారణాలు

బడ్జెట్ 2026లో ఇంపోర్ట్ డ్యూటీలపై పెద్ద మార్పులు లేకపోవడం, ప్రాఫిట్ బుకింగ్ చేయడం. గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలం, యూఎస్ ట్రేడ్ డీల్ ఆశలు తదితరాలు మార్కెట్ మీద ప్రభావం చూపుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

Updated Date - Feb 03 , 2026 | 04:42 PM