Share News

గుడ్ న్యూస్.. విదేశాల నుంచి 40 గ్రాముల వరకు బంగారం తెచ్చుకోవచ్చు

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:38 PM

విదేశాలకు వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలు కొనుక్కొని తెచ్చుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. భారత్ తో పోలిస్తే విదేశాల్లో బంగారం క్వాలిటీగా ఉంటుందని, ధర తక్కువకు వస్తుందని ఇలా చేస్తుంటారు. ఇలాంటి వారికి ఇప్పుడొక గుడ్ న్యూస్.

గుడ్ న్యూస్.. విదేశాల నుంచి 40 గ్రాముల వరకు బంగారం తెచ్చుకోవచ్చు
India baggage rules 2026

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 3: ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో సుమారు 394% మేర పెరుగుదల వచ్చిన నేపథ్యంలో బ్యాగేజీ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. బ్యాగేజీ నిబంధనలు-2026 అమల్లోకి తెచ్చింది. ఇవి ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఫలితంగా విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల్లో మనదేశానికి వచ్చే ప్రయాణికులు మహిళలైతే 40 గ్రాములు, పురుషులైతే 20 గ్రాముల వరకూ డ్యూటీ ఫ్రీగా బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు.


అయితే, వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసించి తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా అయి ఉండాలి. ఈ ఆభరణాలు వ్యక్తిగత వినియోగం కోసమే తీసుకురావాలి. బంగారం బిస్కెట్లు, బంగారం కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఈ మినహాయింపులు ఉండవు. ఇప్పటివరకు మహిళలు రూ.లక్ష, పురుషులు రూ.50వేల విలువైన ఆభరణాలే విదేశాల నుంచి తెచ్చుకునే వీలుండేది. బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చారు.


ప్రధాన మార్పు:

ఆభరణాలకు వ్యాల్యూ క్యాప్ తొలగింపు గతంలో రూ.లక్ష వరకూ విలువ పరిమితి ఉండేది.. లేదా బరువు పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ విలువ పరిమితి పూర్తిగా తొలగించారు. బదులుగా బరువు పరిమితి ఆధారంగా మాత్రమే డ్యూటీ-ఫ్రీ చేశారు.

గతంలోని పాత పరిమితులతో మహిళలకు (లేడీ ప్యాసెంజర్) 40 గ్రాముల బరువు వరకు లేదా రూ.లక్ష విలువ వరకు (ఏది తక్కువైతే అది). అంటే, ఆభరణాల విలువ రూ.లక్ష మించకుండా, 40 గ్రాముల వరకు కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు.

పురుషులకు లేదా ఇతర ప్యాసెంజర్లు 20 గ్రాముల బరువు వరకు లేదా రూ.50,000 విలువ వరకు (ఏది తక్కువైతే అది). అంటే, ఆభరణాల విలువ రూ.50,000 మించకుండా, 20 గ్రాముల వరకు డ్యూటీ-ఫ్రీ ఉండేది. ఇప్పుడు.. అంటే ఇవాళ్టి నుంచి విలువను తొలగించి, కేవలం బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.


ఇవి కూడా చదవండి:

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

Updated Date - Feb 03 , 2026 | 04:10 PM