Stock Market: సూచీలకు తప్పని నష్టాలు.. వరుసగా మూడో రోజూ నేల చూపులే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 03:58 PM
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పడిపోతుండడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ముగిశాయి.
దేశీయ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాలనే చవిచూశాయి. బుధవారం ఉదయం లాభాల్లోకి వచ్చిన సూచీలు చివరకు నష్టాలతోనే రోజును ముగించాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పడిపోతుండడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (85, 679)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగ జారింది. ఒక దశలో 84, 889 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ కిందకు దిగివచ్చింది. చివరకు సెన్సెక్స్ 120 పాయింట్ల నష్టంతో 84, 559 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 41 పాయింట్ల నష్టంతో 25, 818 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏపీఎల్ అపోలో, హిందుస్థాన్ జింక్, శ్రీరామ్ ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). మ్యాక్స్ హెల్త్‌కేర్, పాలీక్యాబ్, కోల్గేట్, పీబీ ఫిన్‌టెక్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 321 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.38గా ఉంది.
ఇవి కూడా చదవండి..
కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..
ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..