Share News

Brazil statue collapse: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:17 PM

ప్రస్తుతం బ్రెజిల్‌ను తీవ్ర తుఫాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ దక్షిణ భాగాన్ని భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వణికిస్తున్నాయి. ఈదురు గాలుల కారణంగా అనేక చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ఈ గాలుల ధాటికి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం చూస్తుండగానే కుప్పకూలిపోయింది.

Brazil statue collapse: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..
Statue of Liberty Brazil

ప్రస్తుతం బ్రెజిల్‌ను తీవ్ర తుఫాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా బ్రెజిల్ దక్షిణ భాగాన్ని భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వణికిస్తున్నాయి. ఈదురు గాలుల కారణంగా అనేక చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ఈ గాలుల ధాటికి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అదేంటి.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఉండేది అమెరికాలో కదా అనుకుంటున్నారా? అవును.. బ్రెజిల్‌లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ప్రతిరూపం లాంటి నిర్మాణం ఉంది (Statue of Liberty viral video).


అగానే గువైబా నగరంలో హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కుప్పకూలిపోయిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బలమైన గాలుల కారణంగా విగ్రహం మొదట కాస్త వంగినట్టు కనిపించింది. కాసేపటికే అది పూర్తిగా కూలిపోయింది. ఈ విగ్రహాన్ని 2020లో ఓ ప్రైవేట్ రిటైల్ స్టోర్ బయట ఏర్పాటు చేశారు. 24 మీటర్ల విగ్రహాన్ని 11 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ బేస్‌పై అమర్చారు. అది తాజాగా కూలిపోయింది (statue fell due to winds).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Statue of Liberty Brazil). చాలా మంది అది అమెరికాలోని ప్రఖ్యాత స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం అనే అనుకుంటున్నారు. కాగా, తుఫాన్ కారంణంగా దక్షిణ బ్రెజిల్‌లో 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్టు బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారులు ప్రకటించారు. ప్రజలందరూ అప్రతమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.


ఇవి కూడా చదవండి..

అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..


మీ కళ్ల పవర్‌కు టెస్ట్.. ఈ నది ఒడ్డున కుక్క ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 16 , 2025 | 03:17 PM