Viral Video: అతిథులకు అదిరిపోయే విందు.. ఈ మర్యాదలు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే..
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:21 PM
వివాహ వేడుక చాలా వైభవంగా జరగాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అవసరమైతే అప్పులు చేసి కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లి కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెడుతుంటారు.
పెళ్లి (Marriage) అనేది మరపురాని అనుభూతిగా మిగిలిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వివాహ వేడుక చాలా వైభవంగా జరగాలనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అవసరమైతే అప్పులు చేసి కూడా ఘనమైన ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లి కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చుపెడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో (Wedding Video)ను చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే విందు భోజన (Wedding Feast) సమయంలో అతిథులకు రాచ మర్యాదలు చేశారు.
@Sheetal2242 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వివాహ వేడుకలో విందు భోజనం చేస్తున్న అతిథుల (Guests) కోసం చేసిన ఏర్పాట్లు కళ్లు చెదిరే రీతిలో ఉన్నాయి. అతిథులు కూర్చునేందుకు సింహాసనాలు వేశారు. వారు తినేందుకు బంగారు రంగులో ఉన్న నెమలి కంచాలను ఏర్పాటు చేశారు. అచ్చంగా రాచ మర్యాదలు చేశారు. ఆ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఆ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 1.3 లక్షల మంది వీక్షించారు (Fat Weddings).
ఈ ఏర్పాట్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 'ఏ పెళ్లిలోనూ ఇలాంటి ఏర్పాట్లు చూడలేదు', 'చాలా ఘనంగా ఉంది', 'దేశంలో చాలా మంది తిండి లేక ఇబ్బంది పడుతున్నారు.. ఈ స్థాయిలో ఐశ్వర్య ప్రదర్శన అవసరమా', 'ఇలాంటి భారీ వివాహాలు చాలా మందికి ఉపాధి కల్పిస్తాయి' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవీ చదవండి:
అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..