Share News

Bengaluru News: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్.. ఆయన.. ఓ ఔట్‌ గోయింగ్‌ సీఎం..

ABN , Publish Date - Dec 19 , 2025 | 01:50 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యనుద్దేశించి ఆయన.. ఓ ఔట్‌ గోయింగ్‌ సీఎం అంటూ అనడంతో.. కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి.

Bengaluru News: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్.. ఆయన.. ఓ ఔట్‌ గోయింగ్‌ సీఎం..

- సిద్దరామయ్యపై బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర

- తండ్రి ముసుగులో అవినీతి ఆయన నైజం: డీకే ఎదురు దాడి

బెంగళూరు: బెళగావి సువర్ణసౌధ వేదికగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యనేతల మాటల తూటాలు పేల్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP State President Vijayendra) ఆరోపణలకు డీసీఎం డీకే శివకుమార్‌ ధీటైన పదజాలంతో తిప్పికొట్టారు. గురువారం విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం అన్నారు. ఖజానా ఖాళీ చేశారని ప్రతి విషయంలోను గ్రాంట్ల లోటు అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి పెరిగిందని వాల్మీకి అభివృద్ది కార్పొరేషన్‌లో 90 కోట్ల రూపాయలకు పైగా దాకా అవినీతి జరిగిందన్నారు.


ఆయనో కలెక్షన్‌ కింగ్‌: డీకే

ఇదే విషయమై డీసీఎం డీకే శివకుమార్‌ తీవ్రంగా స్పందించారు. తండ్రి యడియూరప్ప పేరు చెడిపారని అతడో కలెక్షన్‌ కింగ్‌ అంటూ విజయేంద్రను ఉద్దేశించి మండిపడ్డారు. ఎక్కడెక్కడో తిరుగుతూ మాట్లాడటం కాదని అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెబుతానన్నారు. విజయేంద్రకు సభలోను జీవితంలోనూ, రాజకీయంగాను అనుభవం లేదన్నారు. విజయేంద్ర ఓ పెద్ద కలెక్షన్‌ మాస్టర్‌ అన్నారు. అతడి ట్రాన్స్‌ఫర్‌ కలెక్షన్‌ గురించి విడమరచి చెప్పాలా అంటూ సవాల్‌ చేశారు.


pandu1.2.jpg

అయితే డీకే శివకుమార్‌ వ్యాఖ్యలపైనా విజయేంద్ర ధీటుగా స్పందించారు. డీకే శివకుమార్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన గతి తనకు పట్టలేదన్నారు. మాట్లాడే ముందు నోరు అ దుపులో పెట్టుకోవాలన్నారు. తన గురించి, తన తండ్రి గురించి మాట్లాడే ముందు తెలుసుకోవాలన్నారు. తాను రోజు అసెంబ్లీకు వస్తున్నానని కేవలం బుధవారం మాత్రమే ఢిల్లీ వెళ్ళానని అంతకు మించి రోజూ సభలో ఎన్ని అంశాలపై మాట్లాడానో తెలుసుకోవాలన్నారు.


మాజీ మంత్రి రాజణ్ణ స్పందిస్తూ మేం కూడా విజయేంద్ర అవుట్‌ గోయింగ్‌ బీజేపీ ప్రెసిడెంట్‌ అంటామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను జీర్ణించుకునే ఆయనకు సత్తా ఉందా అని సవాల్‌ విసిరారు. అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని, బీజేపీ నేతలు నిజమెరిగి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. సభలో ఇరు వర్గాలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి, వెండి ధరలు మరింత పైకి!

కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2025 | 01:50 PM