Share News

AICC: అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

ABN , Publish Date - Jan 07 , 2026 | 09:14 PM

అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.

AICC: అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను నియమించిన ఏఐసీసీ
AICC

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ (AICC) బుధవారంనాడు నియమించింది. అస్సాం, కేరళ, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌కు ఈ పరిశీలకులను నియమించింది. ఈ నియమకాలు తక్షణం అమల్లోకి వచ్చినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.


ఏఐసీసీ నియమాకాలు ఇవే

అస్సాం రాష్ట్రానికి మాజీ సీఎం భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, బంధు తిర్కీ ఏఐసీసీ సీనియర్ పరిశీలకులుగా నియమితులయ్యారు. కేరళ పరిశీలకులుగా రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, కన్హయ్య కుమార్ నియమితులయ్యారు. తమిళనాడు, పుదుచ్చేరి పరిశీలకులుగా ముకుల్ వాస్నిక్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మెుహమ్మద్ నిజాముద్దీన్ పరిశీలకులుగా ఉంటారు. పశ్చిమబెంగాల్‌కు సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్ పరిశీలకులుగా నియమితులయ్యారు.


అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో పార్టీ వ్యూహాలను అమలు చేయడం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారానికి సమన్వయం చేయడంలో సీనియర్ పర్వవేక్షకులు కీలక పాత్ర పోషించనున్నారు.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2026 | 09:18 PM