Jaishankar Slams West: పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:47 PM
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్‌పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయటం లేదని అన్నారు.
పశ్చిమ దేశాల వైఖరిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్‌పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయటం లేదని అన్నారు. కానీ, ఎక్కడో కూర్చుని ఇండియాకు ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటాయని మండిపడ్డారు.
తమకు వేల మైళ్ల దూరంలో ఉన్న దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ఆ పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతాయని, తమ సొంత ప్రాంతంలో జరిగితే మాత్రం వాటిని పట్టించుకోవని ఎద్దేవా చేశారు. కొంతమంది చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ మండిపడ్డారు. సాయం చేయాలనుకునే వారితో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లా ప్రవర్తిస్తే అలాగే సమాధానం ఇస్తామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం చాలా దేశాలు స్వార్ధం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు.
కాగా, వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా డెల్టా ఫోర్స్ సైన్యం జనవరి 3వ తేదీన వెనెజువెలాపై దాడి చేసి ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుంది. ఈ దాడిలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వెనెజువెలాపై అమెరికా చర్యల నేపథ్యంలో జైశంకర్ పశ్చిమ దేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
నాలుగో రోజు ముగిసిన ఆట.. 119 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్