The Ashes: నాలుగో రోజు ముగిసిన ఆట.. 119 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:52 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్‌పై 119 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జాకబ్ బెథెల్(142*) అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్‌పై 119 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇంగ్లండ్ యువ ప్లేయర్ జాకబ్ బెథెల్(142*) టెస్టుల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. బెథెల్‌తో కలిసి హ్యారీ బ్రూక్(42).. 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డకెట్(42) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలీ(1), రూట్(6), విల్ జాక్స్(0), జెమీ స్మిత్(26), స్టోక్స్(1), కార్సే(16) ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో వెబ్‌స్టర్ 3, బోలాండ్ 2, నీసర్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు 518/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు 133.5 ఓవర్లలో 567 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 129 పరుగులతో నిలిచిన స్టీవ్ స్మిత్ 138 (220 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) రన్స్ చేసి ఔటయ్యాడు. 48 పరుగులతో క్రీజులోకి వచ్చిన వెబ్‌స్టర్ 71 (87 బంతుల్లో, 7 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ 5, బోలాండ్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3, బెన్‌స్టోక్స్ 2, విల్ జాక్స్, జాకబ్ బెథెల్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇండియా వద్దంటే.. పాకిస్తాన్‌లో ఆడతా: ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?