Bangladesh Premier League: నేనే స్వచ్ఛందంగా తప్పుకున్నా.. ఆ వార్తల్లో నిజం లేదు: రిధిమా పాఠక్
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:12 PM
భారత్-బంగ్లాదేశ్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు (BPL) ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్న భారత్‌కు చెందిన రిధిమా పాఠక్‌ను హోస్టింగ్ ప్యానల్ నుంచి తొలగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా రిధిమా స్పందించారు. ఆ వార్తలను ఖండించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రాజకీయ అనిశ్చితి కారణంగా కొంత కాలంగా వరుసగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.20కోట్లు పెట్టి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను దక్కించుకున్న కేకేఆర్ జట్టు.. బీసీసీఐ ఆదేశాలతో రిలీజ్ చేసింది. దీనిపై ఆగ్రహానికి గురైన బంగ్లా ప్రభుత్వం.. అక్కడ ఐపీఎల్ ప్రసారాలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గందరగోళంలో క్రికెట్‌కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు (BPL) ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్న భారత్‌కు చెందిన రిధిమా పాఠక్(Ridhima Pathak)ను హోస్టింగ్ ప్యానల్ నుంచి తొలగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా రిధిమా స్పందించారు. ఆ వార్తలను ఆమె ఖండించారు.
‘బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL) నుంచి నన్ను తొలగించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వాటిలో నిజం లేదు. బీపీఎల్ నుంచి వైదొలగాలని నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నా. నేనే బీపీఎల్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నా. నాకు నా దేశమే ముఖ్యం. ఆ తర్వాతే ఏదైనా. నిజాయతీ, గౌరవం, అభిరుచితో కొన్ని సంవత్సరాలుగా క్రికెట్‌కు సేవ చేసే అవకాశం నాకు లభించింది. దాన్ని మాత్రం కొనసాగిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఇండియా వద్దంటే.. పాకిస్తాన్‌లో ఆడతా: ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?