T20 WC 2026: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:09 AM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య ఈ మెగా టోర్నీ జరగనుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి(T20 WC 2026) న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది.
ఈ ప్రపంచ కప్ కంటే ముందు న్యూజిలాండ్ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజిలో న్యూజిలాండ్.. ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా అఫ్గనిస్థాన్‌తో, ఫిబ్రవరి 10న అదే వేదికగా యూఏఈతో, ఫిబ్రవరి 14న అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 17న చెన్నై వేదికగా కెనడాతో తలపడనుంది.
న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు..
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), డెవన్ కాన్వే (వికెట్ కీపర్), ఫిన్ అలెన్ (వికెట్ కీపర్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, లూకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారెల్ మిచెల్, ఆడమ్ మిలైన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధీ.
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు కోచ్‌గా ఉండటం అంత సులభం కాదు: హర్భజన్ సింగ్
అన్ని ఫార్మాట్లకు రిటైర్ అవ్వాల్సింది.. కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు