Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... భద్రతా బలగాల ఉచ్చులో ముగ్గురు టెర్రరిస్టులు
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:37 PM
జమ్మూకశ్మీర్‌లో ఎస్‌ఓజీతో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని కథువా జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో గాలింపు చర్యలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో బిలావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమద్ నల్లా సమీపంలో ఒక టెర్రరిస్టును స్థానికులు గుర్తించారు. ధన్ను పరోల్ వద్ద కూడా ఉదయం అతన్ని చూసినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఎస్‌ఓజీతో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ఈ ఏడాది భద్రతా బలగాలు చేపట్టిన తొలి కీలక ఆపరేషన్ ఇదేనని, జమ్మూ ఐజీ, కథువా ఎస్ఎస్‌పీ శర్మ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారని భద్రతా బలగాలు తెలిపాయి. ప్రస్తుతం ఎదురెదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్
పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి