Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:57 PM
కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. సోనియాగాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఢిల్లీ , జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. సోనియాగాంధీ తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న నేపథ్యంలో ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీకి సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అనారోగ్యానికి కారణం కాలుష్యమేనా..
ఢిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం కారణంగానే సోనియా గాంధీకి ఈ అనారోగ్య పరిస్థితి ఏర్పడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాలుష్య స్థాయిలు పెరగడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచించారు.
వైద్యుల పర్యవేక్షణలో చికిత్స..
వైద్యుల సూచనల మేరకు సోనియాగాంధీకి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా వైద్యులు గమనిస్తున్నట్లు సమాచారం. కాగా గతంలోనూ సోనియాగాంధీ పలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూాడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి