Share News

Sonia Gandhi notice: నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు.. సోనియా గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు..

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:58 PM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందారని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.

Sonia Gandhi notice: నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు.. సోనియా గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు..
Sonia Gandhi citizenship issue

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీ నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందారని ఢిల్లీకి చెందిన న్యాయవాది వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసి సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా న్యాయస్థానం సమన్లు జారీ చేసింది (Rouse Avenue Court).


సోనియా గాంధీ పేరును 1980 ఓటర్ల జాబితాలో చేర్చారు. అయితే సోనియా గాంధీ 1983లో భారత పౌరసత్వం తీసుకున్నారు. అంటే సోనియా గాంధీ భారత పౌరసత్వం తీసుకోక ముందే నకిలీ పత్రాలు సమర్పించి ఓటు హక్కు పొందారనేది ఆమెపై ఆరోపణ. ఢిల్లీ న్యాయవాది వికాస్ త్రిపాఠి సోనియాపై పిటిషన్ వేశారు. అయితే సరైన ఆధారాలు లేవనే కారణంతో ఈ కేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కొట్టేశారు (Sonia Gandhi citizenship issue).


మెజిస్టీరియల్ కోర్టు ఆదేశాన్ని వికాస్ త్రిపాఠి రౌస్ అవెన్యూ కోర్టులో సవాలు చేశారు (voter list inclusion case). రివిజన్ పిటిషన్ వేశారు. ఈ రివిజన్ పిటిషన్‌ను తాజాగా విచారించిన రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే.. సోనియా గాంధీ, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 6, 2026కు వాయిదా వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 09 , 2025 | 03:36 PM