Congress 140: ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:27 PM
140వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ జరుపుకుంటోంది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు..
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇవాళ (డిసెంబర్ 28)న ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఘనంగా జరుపుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఖర్గే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో అనేక చరిత్రాత్మక మార్పులు వచ్చాయని, గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ వంటి కార్యక్రమాలతో దేశాన్ని మార్చామని చెప్పుకొచ్చారు.
'కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శిస్తున్నారు. మా శక్తి తగ్గింది కావచ్చు.. కానీ పోరాటం ఆగలేదు' అంటూ ఖర్గే స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో స్థాపించిన సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, ప్రజల అధికారాలను ఆర్‌ఎస్‌ఎస్ లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎప్పుడూ మతం పేరుతో ఓట్లు అడగలేదని, ప్రజలను ఐక్యం చేస్తుందని.. అయితే బీజేపీ విడదీస్తోందని విమర్శించారు. 'ఎన్నికల గురించి కాదు.. దేశం కోసమే మా పోరాటం' అంటూ ఖర్గే వెల్లడించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు వివిధ రాష్ట్రాల్లో ఈ వేడుకలను జరుపుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇది మృత్యువుతో ఆడుకోవడం కాక మరేంటి.. ఈ మహిళల ప్రమాదకర విన్యాసం చూస్తే..
పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..