Share News

Viral Wedding Video: పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:10 PM

మాజీ ప్రియుడి పెళ్లిలో యువతికి దారుణమైన అవమానం జరిగింది. పెళ్లి కొడుకు చెయ్యిని ముద్దు పెట్టుకోవటంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. వాయు వేగంతో స్పందించింది. భర్త మాజీ ప్రియురాలిపై దాడి చేసింది.

Viral Wedding Video: పెళ్లిలో ఊహించని సంఘటన.. భర్తను ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియురాలిపై..
Viral Wedding Video

మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లిన ఓ యువతికి దారుణమైన అవమానం జరిగింది. పెళ్లి కొడుకు చెయ్యిని ముద్దు పెట్టుకోవటంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. వాయు వేగంతో స్పందించింది. భర్త మాజీ ప్రియురాలిపై దాడి చేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ప్యాంట్స్, షర్ట్ వేసుకున్న ఓ అమ్మాయి మాజీ ప్రియుడి పెళ్లికి వెళ్లింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.


ఆ వెంటనే పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. దీంతో పెళ్లి కూతురు తీవ్ర ఆగ్రహానికి గురైంది. భర్త మాజీ ప్రియురాలి జుట్టు పట్టుకుని ఒక్కసారిగా ముందుకు లాగి పడేసింది. ఆ యువతి మోకాళ్లపై నేలపై పడిపోయింది. కిందపడ్డ ఆమెపై పెళ్లి కూతురు దాడి చేసింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడి వారంతా షాక్ అయ్యారు. పెళ్లి కొడుకు వెంటనే స్పందించాడు. మాజీ ప్రియురాలిని భార్య దాడి నుంచి తప్పించాడు. దాదాపు 11 సెకన్ల నిడివి గల వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘భార్యాభర్తల మధ్యలోకి వెళితే ఇలానే అవుతుంది. ఆ యువతికి తగిన శాస్తి జరిగింది’..‘నాకు కూడా ఇలాంటి భార్య కావాలి. దేవుడా త్వరగా నా జీవితంలోకి పంపించు’.. ‘నేను ఆ భార్యలాంటి అమ్మాయిని.. నా భర్త జోలికి వస్తే ఏమాత్రం ఉపేక్షించను’..‘ఆ పెళ్లి కొడుక్కు కొంచెం కూడా బుర్ర లేదు. భార్య ముందే పరాయి అమ్మాయి ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఎలా అంగీకరించాడు’..‘సూపర్ ఉమెన్.. చాలా వేగంగా స్పందించి భర్తను కాపాడుకుంది’ అంటూ కొంతమంది ఫన్నీగా స్పందిస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదాపై మంత్రి నారాయణ క్లారిటీ

ఇది మాకు ఎంతో ప్రత్యేకం.. తమ చారిత్రక విజయంపై స్టోక్స్

Updated Date - Dec 27 , 2025 | 04:20 PM