Minister Narayana: తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదాపై మంత్రి నారాయణ క్లారిటీ
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:47 PM
తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో దీనిపై చర్చించలేదని తెలిపారు.
అమరావతి,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, విజయవాడలకు గ్రేటర్ హోదా కల్పించడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) క్లారిటీ ఇచ్చారు. జనగణన ఉన్నందున విలీనానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉండటంతో ఈ విషయంపై చర్చించలేదని తెలిపారు. జనగణన జరగబోతోంది కాబట్టి ప్రస్తుతం డీలిమిటేషన్ చేయకూడదనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రక్రియను కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు మంత్రి నారాయణ.
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి నారాయణ. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించామని తెలిపారు. మరోసారి సమావేశమై గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
జరీబు, నాన్ జరీబు భూములపై రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గన్నవరం విమానాశ్రయం భూములకు సంబంధించి కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రాజధాని రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్‌లో 42మంది మార్పులు కోరారని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్ మార్చుకోవాలనుకునే అన్నదాతలు దరఖాస్తు చేసుకుంటే వాటిని మారుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం
జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
Read Latest AP News And Telugu News