Jagan Birthday Celebrations: రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:26 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వికృత చేష్టలు, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేలా జగన్ బర్త్ డేను వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు.
అమరావతి,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు (Jagan Mohan Reddy Birthday Celebrations) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వికృత చేష్టలు, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేలా జగన్ బర్త్ డేను వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గర్బిణిని కాలితో తన్ని అరాచకం సృష్టించారు వైసీపీ కార్యకర్తలు. బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లను ప్రదర్శిస్తూ జంతు బలి చేసి జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకం చేశారు.
బహిరంగంగా జంతు బలి చేసి ప్రజలను భయబ్రాంతులకు వైసీపీ కేడర్ గురి చేశారు. ‘నువ్వు సృష్టించే విధ్వంసం చూడాలని ఉంది జగనన్నా’ అంటూ కత్తులతో కూడిన ఆయన చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నానా హంగామా సృష్టించారు. వైసీపీ నేతలు సృష్టించిన ఈ అరాచకంపై వివిధ పోలీస్ స్టేషన్లల్లో ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులతో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో కత్తుల ప్రదర్శన, జంతు బలి చేసి రక్తాభిషేకాలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. బాణసంచా శబ్ధాలతో తనకు ఇబ్బందిగా ఉందని చెప్పిన సంధ్యారాణి అనే గర్భిణిని కాలితో మానవత్వం లేకుండా వైసీపీ కార్యకర్త అజయ్ దేవా తన్ని భయాందోళనలకు గురిచేశాడు.
ఆయనను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు పోలీసులు. కల్యాణదుర్గం, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో గొర్రెల తలను నరికి, రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు వైసీపీ కార్యకర్తలు. రాప్తాడు నియోజకవర్గంలో జగన్ ఫ్లెక్సీకి గొర్రెను బలిచ్చి వేడుకలు నిర్వహించారు. గొర్రె రక్తంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఫ్లెక్సీపై చల్లి వైసీపీ కార్యకర్తలు భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటనలో ఓ వైసీపీ సర్పంచ్‌తో సహా 13మందిపై కేసు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లోనూ అదే తంతుగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి భయాందోళనలకు గురిచేశారు. గోపాలపురంలోనూ వివాదస్పద వ్యాఖ్యలతో జగన్ చిత్రంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించి కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ తరహా వ్యవహారాలపైవైసీపీ శ్రేణులపై కఠిన చర్యలకు ఏపీ పోలీస్ శాఖ సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి...
ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...
ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్, కేసీఆర్‌లపై జగ్గారెడ్డి సెటైర్లు
Read Latest AP News And Telugu News