Deputy CM Pawan Kalyan: ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:46 AM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి అనుచిత పోస్టు చేశాడు. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు, డిసెంబర్ 27: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)పై తరచుగా అనుచిత పోస్టులు పెట్టడం సంచలనం రేపుతోంది. రాజకీయ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసభ్యకరమైన వ్యాఖ్యలతో పవన్‌ను ఉద్దేశించి పలువురు అనుచిత పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. ఇలాంటి కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్‌పై అసభ్యకరమైన పోస్టు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. అది కూడా ఇటీవల ఇప్పటంలో ఓ వృద్ధురాలిని పవన్ కలిసిన ఫొటోలను అసభ్యకర రీతిలో పోస్టు చేశాడో వ్యక్తి. దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఇచ్చిన మాట కోసం ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె కాళ్లను నమస్కరించడంతో పాటు.. వృద్ధురాలిని మాతృభావంతో ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు డిప్యూటీ సీఎం. అంతేకాకుండా వృద్ధురాలికి రూ.50వేలు, మనవడి చదువుకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎప్పుడూ అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. పవన్ రాకతో వృద్ధురాలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
అయితే, సదరు వృద్ధురాలిని పవన్ ఆలింగనం చేసుకున్న ఫొటోను తప్పుడు దృష్టితో చూసిన ఓ వ్యక్తి.. అనుచిత వ్యాఖ్యలతో దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నిందితుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసైనికులు వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుచితంగా పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
తృటిలో ప్రమాదం తప్పిందిగా.. వెనక్కి జారిన ట్రైన్
Read Latest AP News And Telugu News