JC Prabhakar Reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తాం..
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:35 AM
న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...న్యూఇయర్ వేడుకలకు సినీనటి మాధవీలతను ఆహ్వానిస్తున్నామనీ, ఆమె వస్తారో.. రారో.. తెలియదన్నారు.
- జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి(అనంతపురం): పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలు మూడురోజులపాటు నిర్వహిస్తామని, సినీ నటి మాధవీలతను ఆహ్వానిస్తామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) తెలిపారు. పెన్నానది ఒడ్డున ఉన్న పార్కులోనే వేడుకలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శుక్రవారం అనంతపురం(Ananthapuram)లోని కలెక్టరేట్ సమీపాన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ న్యూఇయర్ వేడుకలకు సినీనటి మాధవీలతను ఆహ్వానిస్తున్నామనీ, ఆమె వస్తారో.. రారో.. తెలియదన్నారు.

గతేడాది పెన్నానది ఒడ్డున పార్కులో న్యూఇయర్ వేడుకలపై మాధవీలత వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం విదితమే. ఆ వ్యవహారంలో తాము రాజీ అయ్యామనీ, దీంతో మాధవీలతను ఆహ్వానించాలనుకున్నామన్నారు. రావడం ఆమె ఇష్టమన్నారు. 29వ తేదీన చిన్నపిల్లలకు అనుమతి ఉంటుందనీ, అందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 30న యువకులకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 31న పెద్దలను అనుమతిస్తామన్నారు. 29, 30 తేదీల్లో అందరూ రావొచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News