Home » Birthday Celebrations
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు వికృత చేష్టలు, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేలా జగన్ బర్త్ డేను వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
వైసీపీలో మరోసారి కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53వ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన బర్త్‌డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణి భర్త నారా లోకేష్.. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ప్రేమపూర్వకమైన సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్ట్ చేశారు.
దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కి బిగ్ షాక్ తగిలింది. నిన్న(గురువారం) రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌లో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
నక్సల్స్‌పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్‌లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
బీజేపీ సీనియర్ నేత, భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ నేడు 98వ వసంతంలోకి అడుగుపెట్టారు. బీజేపీ అగ్రజునికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
హిందీలో రూపొందించిన 'చలో జీతే హై' షార్ట్ ఫిల్మ్‌కు మంగేష్ హడవాలే దర్శకత్వం వహించారు. మహావీర్ జైన్, భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం 2018 జూలై 11న విడుదలైంది.
Jagga Reddy Skips Birthday: ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు జరుపొద్దంటూ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తన కృషిని మళ్లీ పునరంకితం చేస్తానని సీఎంగా నాల్గోసారి అవకాశం ఇచ్చిన తెలుగు ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో సమాజంలోని అసమానతలు తగ్గించి, రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు