Share News

మంత్రి నారా లోకేశ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆకర్షించిన భారీ శకటాల ర్యాలీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 10:34 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) చైర్మన్ మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో వినూత్నంగా వివిధ శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

మంత్రి నారా లోకేశ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆకర్షించిన భారీ శకటాల ర్యాలీ
Minister Nara Lokesh Birthday Celebrations

గుంటూరు, జనవరి23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని (Minister Nara Lokesh Birthday Celebrations) ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) చైర్మన్ మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) ఆధ్వర్యంలో వినూత్నంగా వివిధ శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నారా లోకేశ్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యుడిగా, మంత్రిగా యువనేత సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని చాటి చెబుతూ ఒక్కొక్క శకటాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు.

LOKES8.jpg


కోటి సభ్యత్వాలు...

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగళం పాదయాత్ర, కోటి సభ్యత్వాలు, కార్యకర్తలకు రూ.5 లక్షల భీమా, నిరంతర ప్రజా దర్బారులు కొనసాగించి మన్ననలు పొందారు. మంగళగిరి శాసనసభ్యుడిగా 39 ఏళ్ల తర్వాత లోకేశ్ భారీ విజయం సాధించడం, రికార్డు మెజారిటీ, మంగళగిరిలో 3000 ఇళ్ల పట్టాల పంపిణీ, 100 పడకల ఆస్పత్రి, మోడల్ లైబ్రరీ, మోడల్ స్కూల్, పార్కులు,ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా యువనేత తీర్చిదిద్దారు.

Minister-Nara-Lokesh-Birthd.jpg


విద్యామంత్రిగా ..

మెగా డీఎస్సీ ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయటం, విద్యా మంత్రిగా ఎన్నో సంస్కరణలు, మార్పులు - పేరెంట్స్ టీచర్స్ మీట్, నో బ్యాగ్ డే, రాజకీయ పార్టీ రహిత యూనిఫామ్, ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్ ఏర్పాటు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్స్‌లు అమలు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా - వాట్సాప్ గవర్నెన్స్, 15 బులియన్ డాలర్స్ పెట్టుబడితో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్.. IBM, Microsoft, TCS, Accenture, Cognizant తదితర దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పని చేశారు. త్వరలో ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం వాలీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలా నారా లోకేశ్ తీసుకొచ్చిన ప్రగతిని, సాధించిన విజయాలను, చేసిన అభివృద్ధిని ప్రజలకు చాటి చెప్పేవిధంగా ప్రతి శకటంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ శకటాల రాలీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది, ప్రజలు ఆసక్తిగా ఈ ర్యాలీని తిలకించారు.

LOKES6.jpg


హాజరైన ప్రముఖులు...

ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శాసన సభ్యులు మహ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నగర్ మేయర్ కోవెలముడి రవీంద్ర, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబధయ్య, రాష్ట్ర ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీల, గల్లా రామచంద్రరావు, పెద్ధ సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంత వినూత్నంగా నారా లోకేశ్ జన్మదినాన్ని నిర్వహించిన మన్నవ మోహన కృష్ణని వారు అభినందించారు.

LOKES9.jpg


LOKES5.jpgLOKES2.jpgLOKES4.jpgLOKES3.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 10:43 PM