Share News

ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:58 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు యువనేతకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్
HBD Mana Lokesh

అమరావతి, జనవరి23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) పుట్టినరోజు (జనవరి 23) సందర్భంగా రాజకీయ ప్రముఖులు, టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా యువనేతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X'లో #HBDManaLokesh అనే హ్యాష్‌ట్యాగ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీడీపీ మద్దతుదారులు వేల సంఖ్యలో పోస్టులు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.


శుభాకాంక్షల వెల్లువ

నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువత, అభిమానులు తమ తమ అభినందనలు తెలుపుతున్నారు. ఫొటోలు, వీడియోలు, పోస్టర్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత పెద్దఎత్తున స్వచ్చంధ కార్యక్రమాల్లో పాల్గొంటూ లోకేశ్ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం #HBDManaLokesh హ్యాష్‌ట్యాగ్ ‘X’లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతూ టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజల ఉత్సాహాన్ని చాటుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


సేవా కార్యక్రమాల వెల్లువ

లోకేశ్ పుట్టిన రోజును కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, టీడీపీ శ్రేణులు, యువత పెద్ద ఎత్తున స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

  • రక్తదాన శిబిరాలు: రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యువత రక్తదానం చేస్తూ తమ నాయకుడిపై మక్కువ చూపుతున్నారు.

  • అన్నదానాలు: పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లోకేశ్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  • దేవాలయాల్లో పూజలు: నారా లోకేశ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పలు ప్రముఖ దేవాలయాల్లో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.


లోకేశ్‌కు పెరుగుతున్న ఆదరణ..

నారా లోకేశ్ యువ నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ పునర్నిర్మాణం నుంచి పాలన వరకు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న యువనేతకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.

టీడీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం..

లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి...

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 04:43 PM