నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:41 PM
స్వాతంత్య్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు.
అమరావతి, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Jayanti) 129వ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఘన నివాళులు అర్పించారు. నేతాజీ పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా నేటికీ చెప్పుకుంటున్నామని, స్వాతంత్య్రం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ అంటూ ఎక్స్‌లో సీఎం, మంత్రి పోస్టు చేశారు.
చంద్రబాబు ట్వీట్..
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా ఈనాటికీ చెప్పుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకత. భారత జాతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి కార్యాచరణలో చూపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు ప్రాత:స్మరణీయుడు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఆ మహనీయుని సేవలు స్మరించుకుందాం: లోకేశ్
నేతాజీ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు మంత్రి నారా లోకేశ్. ‘ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి...
విషాదం.. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్య.!
సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
Read Latest AP News And Telugu News