సీఎం అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:59 PM
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమీక్ష సహా వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
అమరావతి, జనవరి 23: దావోస్ పర్యటన ముగించుకుని ఈరోజు (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu).. వచ్చీరాగానే నేరుగా సచివాలయానికి చేరుకుని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశానికి హాజరయ్యారు. సీఎం అధ్యక్షతన జరిగిన 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు సీఎం.
వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు అందజేశారు. అలాగే కౌలు రైతులకు రూ.1,490 కోట్ల మేర వ్యవసాయ రుణాలిచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు రూ. 95,714 కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు జారీచేశారు. ఈ సమావేశంలో అమరావతిని ఫైనాన్షియల్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) ఏర్పాటుపై బ్యాంకర్లతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు.
అంతేకాకుండా.. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల లింకేజీ, కేంద్ర పథకాలు, స్టార్టప్‌లకు బ్యాంకుల సహకారం వంటి కీలక అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రెటరీ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్‌బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం తదితరులు హాజరయ్యారు. అలాగే వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి
విషాదం.. పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్య.!
Read Latest AP News And Telugu News