Share News

మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి

ABN , Publish Date - Jan 23 , 2026 | 07:05 AM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు దావోస్ పర్యటన ముగించుకుని మంత్రి లోకేశ్ నేడు అమరావతికి రానున్నారు.

మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి
Nara Brahmani Birthday Wishes To Nara Lokesh

అమరావతి, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం నేడు. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘బాధ్యతతోపాటు సుదీర్ఘంగా పని చేసుకుని వెళ్లిపోతున్నారు.. మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము నిశబ్దంగా చూస్తున్నాం. మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తి. ఈ ఏడాది మీకు ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నా. నిత్యం మీ పక్కన నడవడం గర్వంగా ఉంది’ అని నారా బ్రాహ్మణి తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ బృందం దావోస్ నుంచి అమరావతికి గురువారం రాత్రి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 10.00 గంటలకు వీరు అమరావతికి చేరుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ టెక్‌ పార్కు

విద్యారంగంలో కలసి పనిచేద్దాం

For AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 07:27 AM