Share News

విద్యారంగంలో కలసి పనిచేద్దాం

ABN , Publish Date - Jan 23 , 2026 | 05:09 AM

కేంబ్రిడ్జి యూనివర్సిటీ వీసీ డెబ్బీ ప్రెంటిస్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లలో 8-10 తరగతుల విద్యార్థులకు...

విద్యారంగంలో కలసి పనిచేద్దాం

కేంబ్రిడ్జి వర్సిటీ వీసీతో మంత్రి లోకేశ్‌ భేటీ

ఇంటర్నెట్ డెస్క్: కేంబ్రిడ్జి యూనివర్సిటీ వీసీ డెబ్బీ ప్రెంటిస్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లలో 8-10 తరగతుల విద్యార్థులకు కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిరత, భవిష్యత్తు నైపుణ్యాలపై కేంబ్రిడ్జి సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలోని వర్సిటీలతో కలసి సంయుక్త పరిశోధన, కరిక్యులమ్‌ డెవల్‌పమెంట్‌, ఫ్యాకల్టీ ఎక్స్చేంజీలపై నిర్మాణాత్మక ఒప్పందానికి చొరవ చూపాలన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు డెడికేటెడ్‌ స్కాలర్‌షి్‌పలు, ఫాస్ట్‌ ట్రాక్‌ అడ్మిషన్ల ద్వారా ప్రోత్సాహం కల్పించాలని కోరారు. ఏఐ, డేటా సైన్స్‌, ఇంజనీరింగ్‌ వంటి అధునాతన సాంకేతికతలపై జాయింట్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌ల కోసం ఏయూ, ఐఐటీ-తిరుపతి వంటి సంస్థలతో కేంబ్రిడ్జి వర్సిటీ కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. డెబ్బీ ప్రెంటీస్‌ స్పందిస్తూ.. భారత్‌లో సీఐఆర్‌ఎఫ్‌ ద్వారా వాతావరణ విద్య, బోధనా పద్ధతులు, డిజిటల్‌ స్కిల్స్‌, లాంగ్వేజ్‌ ప్రోగ్రామ్‌లపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 05:10 AM